త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు మొదలవుతాయి: సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు
- సినీ రంగం కంటే పెద్ద మాఫియా ఇక్కడ ఉంది
- ఎవరు పాడాలో ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయి
- బాలీవుడ్‌లో కలకలం రేపుతున్న సోనూ వ్యాఖ్యలు
ఈ రంగంలోనూ గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని, రెండు కంపెనీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఎవరు పాడాలో కూడా ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయన్నాడు. సినీ రంగం కంటే ఇక్కడ పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.