Chandrababu: ఎంత ధైర్యం మీకు? దొడ్డిదారిన బిల్లులు ప్రవేశపెడతారా?: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

  • సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు మళ్లీ ఎలా తెస్తారన్న చంద్రబాబు
  • ఇదేనా మీ నీతి అంటూ ఆగ్రహం
  • ఆంబోతుల్లా ఉన్నారంటూ వైసీపీ మంత్రులపై విమర్శలు
Chandrababu questions YSRCP leaders in two bills

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ సమావేశాలపై వ్యాఖ్యలు చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపిన సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులను మళ్లీ సభలో తీసుకు రావడానికి ఎంత ధైర్యం మీకు?  అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టికల్ 197 ద్వారా దొడ్డిదారిన ఆ బిల్లులు మళ్లీ మండలిలోకి తీసుకువస్తారా? ఇదేనా మీ నీతి? అంటూ మండిపడ్డారు. ఓవైపు కరోనాతో అల్లాడుతున్న సమయంలో రాజధానిని తరలించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం? అంటూ చంద్రబాబు విమర్శించారు. అడిగేవాళ్లు లేరని ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా? అని నిలదీశారు.

"నేను ఎన్నో చట్టసభల్ని చూశాను. 14 ఏళ్లు సీఎంగా చేశాను. ఇంత దుర్మార్గంగా ఎవరూ చేయలేదు. ఇది ప్రజాస్వామ్యమా? చేసిందంతా చేసి మాపైనే తిరగబడ్డారు. 18 మంది మంత్రులకు మండలిలో ఏం పని? ఎందుకొచ్చారు? ఆంబోతుల మాదిరే విపక్షం మీద పడుతున్నారు. బజారు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. మీరు అన్యాయంగా బిల్లులు తేవాలనుకున్నారు. మీ కుటిల పన్నాగాలను అడ్డుకునేందుకే మేం రూల్ 90 ప్రవేశపెట్టాం" అంటూ ఆవేశపూరితంగా వ్యాఖ్యానించారు.

More Telugu News