Rajya Sabha: ఏపీలో రేపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్

 All set for Rajya Sabha elections in AP tomorrow
  • నాలుగు స్థానాలకు ఎన్నికలు
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
  • సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి
ఏపీలో రేపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు.
Rajya Sabha
Elections
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News