Pithani Sathyanarayana: తాను పారిపోయానంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పితాని వివరణ

Former minister Pithani responds to allegations
  • సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
  • ఇంటి వద్దే ఉన్నానని వెల్లడి
  • ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వాపోయారు. తాను విదేశాలకు పారిపోయానని, రహస్య స్థావరంలో దాక్కున్నానని అంటున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఇంటి వద్దే ఉన్నానని తెలిపారు.

వైసీపీలో చేరలేదన్న అక్కసుతో ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఈఎస్ఐలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నారు. అరెస్టులతో భయాందోళనలు కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, అరెస్ట్ చేయాలని చూసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏపీలో కూడా తమిళనాడు తరహా కక్ష సాధింపు విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు.
Pithani Sathyanarayana
Former Minister
ESI Scam
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News