High Court: కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

  • రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టీకరణ
  • మీడియా బులెటిన్ లో కీలక సమాచారం ఉంచాలని సూచన
  • సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో చెప్పాలన్న హైకోర్టు
 Telangana high court directs state government on corona tests

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలను కాలనీ సంఘాలకు అందించాలని తెలిపింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ చెప్పిందని, ఐసీఎంఆర్ సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. గాంధీ ఆసుపత్రితో పాటు 54 ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేగాకుండా, సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది.

More Telugu News