Salman Khan: సల్మాన్ ఖాన్ పై జియాఖాన్ తల్లి తీవ్ర ఆరోపణలు

Jiah Khans mother criticises Salman Khan
  • అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జియాఖాన్
  • సూరజ్  పంచోలిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • కేసు వీగిపోయేలా సల్మాన్ చేశాడన్న రబియా అమిన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై దివంగత నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు సల్మాన్ చాలా అన్యాయం చేశారని ఆమె అన్నారు. 2015లో జియాఖాన్ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఈ కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు వీగిపోయేలా సల్మాన్ ఖాన్ చేశాడని రబియా అమిన్ ఇప్పుడు ఆరోపించారు. ఆయన తన మనీ పవర్ ను ఉపయోగించారని చెప్పారు. ఈ విషయాన్ని సీబీఐకి చెందిన ఓ అధికారి తనకు చెప్పారని తెలిపారు. సల్మాన్ తనకు ప్రతిరోజు ఫోన్ చేసే వాడని... సూరజ్ పంచోలిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేవాడని సదరు అధికారి తనతో చెప్పారని ఆమె వెల్లడించారు.

మరణానికి ముందు సూరజ్ పంచోలితో జియాఖాన్ ప్రేమలో ఉంది. ఆ తరుణంలో ఆమె అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చావుకు సూరజ్ పంచోలీనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Salman Khan
Mother
Bollywood
Suraj Pancholi
Jiah Khan

More Telugu News