Wife: క్వారంటైన్ లో భర్త.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య!

Wife tries to escape with lover when husband is in quarantine
  • బీహార్ లో చోటుచేసుకున్న ఘటన
  • పని కోసం గుజరాత్ కు వెళ్లిన భర్త
  • పాత ప్రియుడిని కలుసుకున్న భార్య
భర్త క్వారంటైన్ లో ఉండగా... ప్రియుడితో కలిసి చెక్కేయడానికి భార్య వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. బీహార్ లోని బెగూసరాయ్ లో గల షకర్పురాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఏడాది క్రితం బెగూసరాయ్ కి చెందిన యువతికి, ఖాగారియా జిల్లాకు చెందిన యువకునికి వివాహం జరిగింది. వివాహం జరిగిన 9 నెలల తర్వాత భార్యను పుట్టింటిలో దిగబెట్టి.... పని కోసం గుజరాత్ కు వెళ్లాడు. దాంతో అక్కడ ఆమె తన పాత ప్రియుడిని కలుసుకుంది.

ఇంతలోనే భర్త గుజరాత్ నుంచి తిరిగొచ్చాడు. లాక్ డౌన్ నిబంధనలతో నానా బాధలు పడి తిరిగొచ్చిన భర్త 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. క్వారంటైన్ ను ముగించుకుని అత్తారింటికి వచ్చిన ఆయనకు షాక్ లాంటి వార్త తెలిసింది. ప్రియుడితో కలసి భార్య వెళ్లిపోయిందనే విషయం తెలియడంతో, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడితో పాటు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెకు నచ్చజెప్పి భర్తతో పాటు పంపించారు.
Wife
Lover
Escape
Bihar

More Telugu News