మాస్క్ వేసుకొచ్చి.. బ్యాంకును కొల్లగొట్టారు.. వీడియో ఇదిగో!

18-06-2020 Thu 12:37
  • పంజాబ్ లోని మొహాలీలో బ్యాంకు దొంగతనం
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోరీ
  • రూ. 4.80 లక్షలు తీసుకుని పారిపోయిన దొంగలు
Bank robbery in Mohali
పట్టపగలే, అందరూ ఉన్న సమయంలోనే దొంగలు బ్యాంకును కొల్లగొట్టారు. ఈ ఘటన పంజాబ్ లోని మొహాలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులు, కత్తులతో బ్యాంకులోకి చొరబడ్డారు. మహిళా సిబ్బంది మాత్రమే ఆ సమయంలో విధుల్లో ఉన్నారు. సెక్యూరిటీ గార్డు కూడా లేడు. బ్యాంకులోకి చొరబడిన దొంగలు సిబ్బందికి తుపాకీ చూపించి... రూ. 4.8 లక్షల నగదును తీసుకుని పారిపోయారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే తతంగాన్ని ముగించుకుని పరారయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు.