China: మాపై దాడికి దిగితే పాక్, నేపాల్ నుంచి మీకు ప్రతిఘటన తప్పదు: భారత్‌కు చైనా హెచ్చరిక

  • త్రిముఖ వ్యూహానికి సిద్ధమైన చైనా
  • పాక్, నేపాల్‌ లను ఎగదోస్తున్న వైనం
  • పాక్, నేపాల్‌తో ఉన్న సరిహద్దు వివాదాలపై ప్రస్తావన
China says that India should face pak and nepal

లడఖ్‌ ఘటన తర్వాత భారత్‌ను దెబ్బ తీసేందుకు చైనా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా భారత్‌తో సరిహద్దు వివాదాలున్న పాకిస్థాన్, నేపాల్‌ దేశాలను కూడా రంగంలోకి దింపి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. చైనా వ్యూహం గురించి ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’  పేర్కొంది. భారత్ కనుక చైనాపై దాడికి దిగితే పాకిస్థాన్, నేపాల్ నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఓ కథనంలో హెచ్చరించింది.

అయితే, తమ మిత్రదేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అంతటి సాహసానికి ఒడిగట్టబోదని కూడా పేర్కొంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల గురించి కూడా తన కథనంలో ప్రస్తావించింది. అలాగే, పాక్ ఆక్రమిత కశ్మీర్, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు గురించి పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ కనుక చైనాపై దాడికి దిగితే ఆ రెండు దేశాల నుంచి కూడా ముప్పు తప్పదని పరోక్షంగా హెచ్చరించింది.

More Telugu News