AP Legislative Council: శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం... సభ 15 నిమిషాలు వాయిదా

  • వాడీవేడిగా మండలి సమావేశాలు
  • బిల్లులు ప్రవేశపెట్టే అంశంలో భేదాభిప్రాయాలు
  • అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ
AP Legislative council adjourned

ఏపీ శాసనమండలి సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టాలని మంత్రులు పట్టుబట్టగా, టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఇరు పక్షాల మధ్య మండలిలో వాగ్వాదం నెలకొంది. ఏ బిల్లు ముందు ప్రవేశపెట్టాలన్న దానిపై ఓటింగ్ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభ చివరిలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ దశలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరడంతో మండలిలో ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

More Telugu News