Sonia Gandhi: మన భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందో చెప్పండి: సోనియాగాంధీ డిమాండ్

PM has to explain how China occupied our land demands Sonia Gandhi
  • 20 మంది జవాన్లు ఎలా ప్రాణాలు కోల్పోయారు?
  • మన జవాన్లు ఇంకెంత మంది మిస్ అయ్యారు?
  • ఇకపై చైనాతో ఎలా వ్యవహరించబోతున్నారు?
భారత్, చైనా సరిహద్దు వివాదం మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ అంశంపై స్పందిస్తూ, కేంద్రంపై మండిపడ్డారు. మన భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై దేశ ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు.

20 మంది భారత జవాన్లు ప్రాణాలు ఎలా కోల్పోయారో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. మన భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందో చెప్పాలని నిలదీశారు. చైనాతో జరిగిన ఘర్షణలో ఎంత మంది ఆర్మీ అధికారులు, జవాన్లు మిస్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమంది గాయపడ్డారో వెల్లడించాలని అడిగారు. ఇకపై చైనాతో భారత్ ఎలా వ్యవహరించబోతుందో దేశ ప్రజలకు మోదీ వివరించాలని అన్నారు.
Sonia Gandhi
Congress
Narendra Modi
BJP
India
China

More Telugu News