KCR: కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

CM KCR shocks after heard about Krishna district road accident
  • వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం
  • ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ
  • 10 మంది దుర్మరణం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తమ తెలంగాణ పౌరులు కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

మృతులంతా ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందినవారు. వారి స్వస్థలం ఎర్రుపాలెం మండలం గోపవరం. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ సిమెంట్ లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ బోల్తా పడింది.
KCR
Road Accident
Krishna District
Khammam District
Tractor
Lorry
Vedadri
Telangana
Andhra Pradesh

More Telugu News