China: భారత్‌-చైనా ఘర్షణలపై ఐరాస, అమెరికా స్పందన

  • పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా
  • 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు
  • వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
  • ఇరు దేశాలు సంయమనం పాటించాలన్న ఐరాస
america on china india violent face off

భారత్‌-చైనా మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత‌ ఆర్మీ తెలిపిందని, వారి కుటుంబాలకు అమెరికా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ప్రకటన చేశారు.

ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారాలని, శాంతియుతంగా సమస్య పరిష్కారానికి మార్గం కనుగొంటారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 2న అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా చైనా-భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. కాగా, ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు చర్యలు ప్రారంభించినట్లు తమకు తెలిసిందన్నారు.

More Telugu News