Corona Virus: అందరికీ ఫ్రీగా కరోనా చికిత్స చేయించమన్నందుకు రూ. 5 లక్షల ఫైన్ విధించిన హైకోర్టు!

  • ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న పిటిషనర్
  • మహారాష్ట్రలో అందరికీ ఫ్రీగా చికిత్స చేయించాలని విన్నపం
  • డిమాండ్ అర్థరహితంగా ఉందన్న హైకోర్టు
Bombay High Court fines 5 laks to petitioner who requested for free corona treatment

మహారాష్ట్రలోని కరోనా పేషెంట్స్ అందరికీ ఉచితంగా చికిత్స అందించాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తిపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ డిమాండ్ అర్థరహితంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. నెల వ్యవధిలో ప్రభుత్వ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించింది.

ఈ పిటిషన్ ను ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే దాఖలు చేశారు. కరోనాను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని... ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులందరికీ ఉచితంగా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు తప్పుపట్టింది.

More Telugu News