High Commission: రాడ్లతో కొట్టి మురికి నీళ్లు తాగించారు... భారత దౌత్య సిబ్బందికి పాక్ లో చిత్రహింసలు

  • పాకిస్థాన్ లో నిన్న హైడ్రామా
  • కనిపించకుండాపోయిన ఇద్దరు భారత దౌత్య సిబ్బంది
  • 12 గంటల తర్వాత వారిని విడిచిపెట్టిన పాక్ భద్రతా బలగాలు
Indian High Commission employs were beaten by police

పాకిస్థాన్ లో భారత హైకమిషన్ ఉద్యోగులను అక్కడి భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని దాదాపు 12 గంటల హైడ్రామా తర్వాత విడిచిపెట్టడం తెలిసిందే. సోమవారం ఉదయం ఇస్లామాబాద్ లోని ఓ పెట్రోల్ బంకు వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పాక్ సాయుధ బలగాలు వారి చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రదేశానికి తరలించగా, ఆ విషయం తెలియని భారత హైకమిషన్ తమ ఉద్యోగులు అదృశ్యం కావడం పట్ల తీవ్ర ఆందోళన చెందింది. దీనిపై సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం దౌత్యమార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు ఆ ఉద్యోగులిద్దరికీ విముక్తి లభించింది.

కాగా, ఆ ఇద్దరు ఉద్యోగులను గంటల పాటు తమ అదుపులో ఉంచుకున్న భద్రతా బలగాలు వారిని చిత్రహింసలకు గురిచేశాయి. ఇనుపరాడ్లతో, కర్రలతో కొట్టడమే కాకుండా, మురికి నీళ్లు తాగించినట్టు తెలిసింది. చివరికి రాత్రి 9 గంటల సమయంలో వారిని భారత హైకమిషన్ కు అప్పగించారు. కాగా, దీనిపై పాక్ మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. భారత హైకమిషన్ ఉద్యోగులు ఓ రోడ్డు ప్రమాదానికి కారకులు కావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వక్రభాష్యం చెప్పాయి.

More Telugu News