Rajnath Singh: లడఖ్ లో తీవ్ర ఉద్రిక్తతలు.... సీడీఎస్ రావత్, త్రివిధ దళాధిపతులను హుటాహుటిన పిలిపించిన రాజ్ నాథ్

Rajnath Singh conducts emergency meeting
  • లడఖ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
  • ముగ్గురు భారత సైనిక సిబ్బంది మృతి
  • ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న భారత్

భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. లడఖ్ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత భద్రతా సిబ్బంది మరణించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లడఖ్ గాల్వన్ లోయలో ఓ అధికారి, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై తీవ్రంగా చర్చించారు. 1962 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

  • Loading...

More Telugu News