Nokia: నోకియా నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్!

Nokia Feature Phone Releasing Today
  • నేడు మార్కెట్లోకి నోకియా 5310
  • 2007 మోడల్ కు భిన్నంగా కొత్త ఫీచర్ ఫోన్
  • 2.4 ఇంచ్ స్క్రీన్, డ్యూయల్ స్పీకర్లు
ఎన్నో విజయవంతమైన స్మార్ట్ ఫోన్లను, ఫీచర్ ఫోన్లను అందించిన నోకియా, తాజాగా, మరో ఫీచర్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నేడు ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర ఎంతన్న విషయం తెలియరానప్పటికీ, ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. దీన్ని 'నోకియా 5310' పేరిట విడుదల చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇది 2007లో విడుదలైన ఫోన్ కు కాస్తంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

2.4 అంగుళాల స్క్రీన్, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లతో పాటు ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్ దీనిలో ప్రధాన ఆకర్షణలుగా తెలుస్తోంది. ఇదే సమయంలో, 3.5 ఎంఎం హెడ్‌ ఫోన్ జాక్‌, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ  ర్యామ్, వీజీఏ కెమెరా తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.
Nokia
Feature Phone
Release

More Telugu News