Chandrababu: వైజాగ్ రాళ్ల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి: చంద్రబాబు

YSRCP goondas atrocities are increasing day by day says Chandrababu
  • సీసీ రోడ్డు శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే రామకృష్ణ
  • రాళ్లతో దాడి చేసిన వైనం
  • వైసీపీ గూండాల అరాచకాలు పెరిగిపోతున్నాయన్న చంద్రబాబు
విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ గూండాల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసే హక్కు ఎమ్మెల్యేకి లేదా? అని ప్రశ్నించారు.

రాజ్యాంగ నిబంధనలను అధికార పార్టీ ఉల్లంఘిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అన్నారు.
Chandrababu
Velagapudi Ramakrishna
Telugudesam
Vizag
Stone Pelting

More Telugu News