Deepika Padukone: తన బాడీగార్డ్‌కి కోటి రూపాయల వేతనం ఇస్తోన్న బాలీవుడ్ భామ!

You will be surprised to know that Deepika pays her bodyguard as much as her brother
  • మూడేళ్ల క్రితం వరకు ఏడాదికి రూ.80 లక్షల వేతనం 
  • తాజాగా వేతనాన్ని పెంచేసిన దీపిక పదుకొనే
  • బాడీగార్డ్‌ను సొంత సోదరుడిలా చూసుకుంటోన్న వైనం
బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే తన బాడీగార్డ్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందన్న విషయం బయటకొచ్చింది. కొన్నేళ్లుగా ఆమెకు బాడీగార్డ్‌గా జలాల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఆయనను ఆమె సొంత సోదరుడిలా చూసుకుంటోంది. రాఖీ పండుగకు రాఖీ కూడా కడుతుంది. మూడేళ్ల క్రితం ఆయనకు ఆమె ఏడాదికి రూ.80 లక్షల వేతనం ఇచ్చేది.

కాగా, తాజాగా ఆయనకిచ్చే వేతనాన్ని దీపిక మరింత పెంచేసింది. ఆయన ఇప్పుడు ఏడాదికి రూ.కోటి వేతనం పొందుతున్నారు. దీపిక ఎక్కడికి వెళ్లినా ఆయన ఉండాల్సిందే. ఆమె హాజరైన అన్ని ఈవెంట్లలోనూ ఆయన ఉంటాడు. ఆమె ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆయన చూసుకుంటాడు. అందుకే ఆయనంటే దీపికకు చాలా ఇష్టం. తన పర్సనల్ బాడీగార్డ్‌కు ఆమె ఇస్తోన్న వేతనాన్ని గురించి తెలుసుకుంటున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Deepika Padukone
Bollywood

More Telugu News