ఇంటర్‌లో ఫెయిల్.. ఏపీలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్మ

15-06-2020 Mon 08:18
  • ఏపీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు
  • ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇద్దరు అమ్మాయిలు
  • రాజమహేంద్రవరంలో గోదావరిలో దూకి విద్యార్థి ఆత్మహత్య
Inter fail students committed suicide in Andhra Pradesh

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన కీర్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటనలో పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లుకు చెందిన స్నేహలత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

మూడో ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిబాబా ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం గోదావరి నదిలో విగతజీవిగా కనిపించిన కుమారుడిని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.