Hyderabad: లాక్‌డౌన్‌లోనూ వ్యభిచార దందా.. సంపాదన కోసం యువ జంట అడ్డదారి!

Hyderabad police arrest two girls in connection with prostitution case
  • హైదరాబాద్ శివారులో ఘటన
  • ముంబై నుంచి యువతులను రప్పించి వ్యభిచారం
  • ఇద్దరు యువతులు, ఇద్దరు యువకుల అరెస్ట్
డబ్బు సంపాదన కోసం వక్రమార్గం పట్టిన ఓ యువ జంటను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ శివారు మైలార్‌దేవుపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన అబ్దుల్ మిస్కిన్ (30) దంపతులు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా షేక్ ముస్తాక్ (27) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబై నుంచి ఇద్దరు యువతులను నగరానికి రప్పించారు. వీరితో పాతబస్తీ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులు ఫోన్ చేస్తే ముస్తాక్ తన ఆటోలో యువతులను వారింటికి తీసుకెళ్లి దిగబెట్టేవాడు.

ఇటీవల శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్ కాలనీలో వీరు ఓ ఇంటిలో అద్దెకు దిగారు. తర్వాత అక్కడికి అపరిచిత వ్యక్తులు వచ్చి పోతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
prostitute house
Crime News

More Telugu News