Vishnu Kumar Raju: చివరికి సీఎం జగనే చెప్పాల్సి వచ్చిందంటే పోలీసుల తీరు ఎలావుందో అర్థమవుతోంది: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju reacts over Atchannaidu arrest
  • అచ్చెన్నాయుడి తరలింపుపై బీజేపీ నేత స్పందన
  • అరెస్ట్ ను తామేమీ వ్యతిరేకించడం లేదని స్పష్టీకరణ
  • తరలించిన విధానం పట్ల అభ్యంతరం
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని తామేమీ చెప్పడంలేదని, కానీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆయనతో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం అని పేర్కొన్నారు.

"మాత్రలు వేసుకోవాలి.. ఇంకా టిఫిన్ చేయలేదు, ఖాళీ కడుపుతో ఉన్నాను అని చెప్పినా వినిపించుకోకుండా, ఓ టెర్రరిస్టులా, ఓ సంఘవిద్రోహశక్తిలా భావించడం ఆక్షేపణీయం. పోలీసులు, ఏసీబీ అధికారుల తీరుతో చెడ్డపేరు వచ్చేది ఈ ప్రభుత్వానికే. అచ్చెన్నాయుడిని ఆసుపత్రికి తీసుకెళ్లండంటూ చివరికి ముఖ్యమంత్రే చెప్పాల్సివచ్చిందంటే ఈ పోలీసుల తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది" అంటూ వ్యాఖ్యానించారు.
Vishnu Kumar Raju
Atchannaidu
Arrest
ACB
Police

More Telugu News