Mahesh Babu: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మాటలకందని వేదన కలిగించింది: మహేశ్ బాబు

Mahesh Babu responds on Sushant Singh Rajput suicide
  • బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య
  • దిగ్భ్రాంతికి గురయ్యానన్న మహేశ్ బాబు
  • చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమంటూ ట్వీట్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంలో ధోనీ పాత్ర పోషించడం ద్వారా సుశాంత్ భారతీయులపై వేసిన ముద్ర అలాంటిది. ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ అంశంపై స్పందిస్తూ టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం గురించి తెలుసుకున్న తర్వాత మాటలకందని వేదన కలిగిందని, షాక్ కు గురయ్యానని వెల్లడించారు. పొంగిపొర్లే ప్రతిభకు నిదర్శనం లాంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చాలా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో సుశాంత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
Mahesh Babu
Sushant Singh Rajput
Suicide
Mumbai
Bollywood

More Telugu News