nagababu: ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అత్యధిక ప్రాధాన్యతతో కూడుకున్న మన బాధ్యత!: నాగబాబు

Donate your blood for a reason says nagababu
  • నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం
  • నేను రక్తదానం చేశాను
  • అందరూ చేయాలి
  • కరోనా నేపథ్యంలో రక్తదానం చేసేవారు తగ్గిపోయారు
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సినీనటుడు, జనసేన నేత నాగబాబు రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తాను రక్తదానం చేశానని చెప్పారు.
                రక్తదానం చేయాలని తాను అందరినీ కోరుతున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. ఇతరుల జీవితాలను కాపాడానికి రక్తదానం చేయాలని ఆయన కోరారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో రక్తదానం చేయడమే అత్యధిక ప్రాధాన్యతతో కూడుకున్న బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో రక్తదానం చేసేవారు తగ్గిపోయారని ఆయన గుర్తు చేశారు. రక్తానికి ప్రత్యామ్నాయం మరేదీ లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని తెలిపారు. 
nagababu
Janasena
COVID-19

More Telugu News