Petrol: వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol diesel prices go up for the eighth straight day
  • పెట్రోలు లీటరుకు 62 పైసల పెరుగుదల
  • డీజిల్‌పై లీటరుకు 64 పైసల పెంపు
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.75.78
  • డీజిల్ ధర రూ.74.03
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 62 పైసలు, డీజిల్‌పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. వారం రోజుల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.4.50కి పైగా పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.75.78కి, డీజిల్ ధర రూ.74.03కి చేరింది.

ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.82.70కి, డీజిల్‌ 72.64కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.79.53, డీజిల్ ధర రూ.72.10గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.77.64, డీజిల్ ధర రూ.69.80గా ఉంది.
Petrol
diesel
India
New Delhi

More Telugu News