Nara Lokesh: నేటి అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న నారా లోకేశ్... కడపకు పయనం!

Nara Lokesh Ananthapur Tour Cancelled
  • నిన్న అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్
  • కడప జైలుకు తరలింపు
  • వారిని పరామర్శించనున్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్, నేటి తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. నిన్న నాటకీయ పరిణామాల మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు అనంతపురం వెళ్లాలని లోకేశ్ భావించారు.

అయితే, వారిని అనంతపురం జైలుకు కాకుండా, కడపకు తరలించడంతో, తాను కూడా కడపకు వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన లోకేశ్, కడప జైలులో తమ పార్టీ నేతలను కలుస్తానని తెలిపారు.
Nara Lokesh
Kadapa
JC Prabhakar Reddy
Arrest

More Telugu News