Divakar Travels: తాడిపత్రికి కాదు... కడప జైలుకు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి!

JC Prabhakar reddy and his son sent to Kadapa Jail
  • దివాకర్ ట్రావెల్స్ కేసులో అక్రమాలు
  • తాడిపత్రి జైలులో కరోనా కేసులు ఉండటంతో కడపకు
  • అనంతపురంలో భారీ బందోబస్తు
దివాకర్ ట్రావెల్స్ లో జరిగిన అక్రమాల కేసులో నిన్న అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు కడప కేంద్ర కర్మాగారానికి తరలించారు. తొలుత వీరిని అనంతపురం జైలుకు తరలించాలని భావించారు. అక్కడ కరోనా లక్షణాలున్న ఖైదీలు కొందరు ఉండటంతో జైలు అధికారులు వీరిని లోనికి రానిచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో పోలీసులు విషయాన్ని న్యాయమూర్తికి తెలియజేయడంతో తాడిపత్రి తరలించాలని సూచించారు. తాడిపత్రి జైలుకు తరలిస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న ఉద్దేశంతో పోలీసులు, వీరిని కడపకు తరలించారు.

వారిని తరలిస్తున్న క్రమంలో టీడీపీ స్థానిక నేతలు కొందరు పోలీసు వాహన శ్రేణికి అడ్డుగా నిలిచేందుకు ప్రయత్నించిన వేళ, పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తాడిపత్రి, అనంతపురం పట్టణాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు వీరిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, రెండు వారాల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే.
Divakar Travels
JC Prabhakar Reddy
JC Asmith Reddy
Kadapa
Central Jail

More Telugu News