Akkineni Amala: రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేసిన అమల

Akkineni Amala distributes Red Gram seeds to farmers
  • తెలంగాణ రైతుల్లో సంతోషం నింపిన అమల
  • పాపిరెడ్డిగూడ గ్రామంలో 650 మంది రైతులకు విత్తనాలు పంపిణీ
  • ఒక్కో రైతుకు 4 కిలోల కంది విత్తనం అందజేత
అక్కినేని అమల రైతుల పట్ల సహృదయత ప్రదర్శించారు. రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో మొత్తం 650 మంది రైతులకు కంది విత్తనాలు అందించారు. ఒక్కొక్క రైతుకు 4 కిలోల విత్తనాలు పంపిణీ చేశారు. ఓ రైతు ఈ విత్తనాలతో ఎకరం మేర కంది పంట వేసుకోవచ్చని అమల తెలిపారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చి మంచి వర్షపాతం ఇస్తున్న ఈ సమయంలో రైతులకు తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. లాక్ డౌన్ ప్రభావం నుంచి రైతులు కోలుకునేందుకు భర్త నాగార్జున సహకారంతో మద్దతు అందిస్తున్నానని అమల వెల్లడించారు.
Akkineni Amala
Red Gram Seeds
Farmers
Telangana
Lockdown

More Telugu News