Nepal: భారత భూభాగంతో ఉన్న కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు దిగువసభ ఆమోదం

  • భారత్ భూభాగాలతో నేపాల్ కొత్త మ్యాప్
  • 370 చదరపు కి.మీ. భూమిని తమదని చెప్పుకుంటున్న నేపాల్
  • తదుపరి నేషనల్ అసెంబ్లీకి వెళ్లనున్న బిల్లు
Nepal Parliament Votes On New Map Which Includes Indian Territory

నేపాల్ కొత్తగా తయారు చేసిన మ్యాప్ కు ఆ దేశ పార్లమెంటులోని దిగువసభ అయిన ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త మ్యాప్ లో భారత్ కు సంబంధించిన 370 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం ఉంది. కాలాపానీ, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలను నేపాల్ తన భూభాగాలుగా చూపించుకుంది. ఈ మ్యాప్ కు ఆమోదముద్ర వేయించుకునేందుకు యత్నించి ఈ మధ్య కాలంలో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. అయినా పట్టుదలతో ప్రత్యేకంగా ప్రతినిధుల సభను సమావేశపరిచి, చర్చ జరిపి కొత్త మ్యాప్ కు ఆమోద ముద్ర వేయించారు.

కొత్త మ్యాప్ కు ఆమోదం లభించిన నేపథ్యంలో, తదుపరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఎగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన అనంతరం దేశాధ్యక్షుడి ఆమోదం కోసం పంపుతారు. ఆయన ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలో కొత్త మ్యాప్ ను పొందుపరుస్తారు.

మరోవైపు, ఈ భూభాగాలన్నీ తమవేనని భారత్ వాదిస్తోంది. అయితే, చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ఈ సాహసానికి ఒడిగడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News