JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

JC Prabhakar Reddy sent to 14 days remand
  • ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు రిమాండ్
  • గంటల వ్యవధిలోనే మూడో టీడీపీ నేతకు రిమాండ్
  • ఆందోళనలో టీడీపీ శిబిరం
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారనే కేసులో రిమాండ్ కు పంపించింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి కూడా రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరినీ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేసి, అనంతపురానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు, గంటల వ్యవధిలోనే టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు రిమాండ్ కు గురి కావడం గమనార్హం. ఈ పరిణామాలు టీడీపీ శిబిరంలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
JC Prabhakar Reddy
Telugudesam
Remand

More Telugu News