Uttam Kumar Reddy: పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Redday slams Telangana police
  • గోదావరి పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ యత్నం
  • పోలీసులు అడ్డుకున్నారంటూ ఉత్తమ్ ఆగ్రహం
  • ప్రజలు అన్నీ గమనిస్తుంటారని వ్యాఖ్య
తెలంగాణలో గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించడానికి, వీలైతే అక్కడ దీక్షలు చేయడానికి గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీ గోదావరి జలదీక్ష పేరిట ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల వద్దకు బయల్దేరబోగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.

గోదావరి పెండింగు ప్రాజెక్టులను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాశామని, కానీ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సర్కారును హెచ్చరించారు. తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తుమ్మిడి హట్టి రిజర్వాయర్ సందర్శనను రద్దు చేసుకున్నారు.
Uttam Kumar Reddy
Police
Telangana
Congress
Godavari
Pending Projects

More Telugu News