Andhra Pradesh: హైదరాబాదుకు వెళ్లొద్దు: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

  • హైదరాబాద్ సహా ఏ రాష్ట్రానికి వెళ్లొద్దు
  • దీర్ఘకాల జబ్బులు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి
  • కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారు ఇంటి నుంచే పని చేయండి
Dont go to Hyderabad orders AP govt to employees

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కడికీ వెళ్లవద్దని ఆదేశించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని... అనవసరంగా ఎవరూ ఎక్కడకూ వెళ్లొద్దని తెలిపింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. సరైన మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కు అనుమతిస్తామని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా టెస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతించింది. ప్రభుత్వం పంపిన శాంపిల్స్ కు రూ. 2,400.... వ్యక్తిగతంగా ఎవరైనా టెస్ట్ చేయించుకుంటే రూ. 2,900 చెల్లించాని నిర్ణయించింది.

More Telugu News