Ramya Krishnan: రమ్యకృష్ణ కారులో అక్రమ మద్యం తరలింపు.. కారు డ్రైవర్ అరెస్ట్

Actress Ramya Krishnan car driver arrested by police
  • పుదుచ్చేరి నుంచి చెన్నైకి వస్తున్న కారు
  • తనిఖీల నిమిత్తం వాహనాన్ని ఆపిన పోలీసులు
  • కారులో భారీగా మద్యం స్వాధీనం
తమిళనాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రముఖ నటి రమ్యకృష్ణకు చెందిన వాహనం పట్టుబడింది. ఈ ఇన్నోవా వాహనంలో మద్యం తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కారు నుంచి భారీ ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. రమ్యకృష్ణకు చెందిన ఈ వాహనం గత రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా పోలీసులు తనిఖీల నిమిత్తం ఆపారు. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తుండడంతో కారును కూడా సీజ్ చేశారు. తనిఖీల సమయంలో కారులో 100కి పైగా బాటిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రమ్యకృష్ణ ఇంకా స్పందించలేదు. దీనిపై కనత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, రమ్యకృష్ణ కారు డ్రైవర్ బెయిల్ పై బయటికి వచ్చినట్టు సమాచారం.
Ramya Krishnan
Car Driver
Liquor
Police
Tamilnadu
Lockdown

More Telugu News