Perni Nani: చంద్రబాబు గారూ, ఇది మీ ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడ్ని వదిలెయ్యడానికి!: పేర్ని నాని

Perni Nani responds on JC Prabhakar Reddy issue
  • వరుసగా టీడీపీ నేతల అరెస్టులు
  • నిన్న అచ్చెన్న, ఇవాళ జేసీ
  • లారీ ఛాసిస్ లను బస్సు ఛాసిస్ లుగా మార్చారంటూ జేసీపై ఆరోపణ
నిన్న అచ్చెన్నాయుడు, తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇలా వరుసగా టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంలో మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన లారీ ఛాసిస్ లను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. "ఇది మీ ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడిని వదిలెయ్యడానికి. మీడియా సమక్షంలో దీనిపై చర్చిద్దాం రండి.. మా వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?" అంటూ ప్రశ్నించారు.
Perni Nani
Chandrababu
JC Prabhakar Reddy
Lorry
Bus Chasis

More Telugu News