Rashmika Mandanna: మాజీ ప్రియుడితో సినిమాకు ఇబ్బంది లేదంటున్న రష్మిక

Rashmika is ready to work with her ex lover Rakshit Shetty
  • గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక
  • ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిన వైనం
  • పెళ్లికి ముందు విడిపోయిన జంట
కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ బిజీగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందు కన్నడ చిత్రాలలో రష్మిక నటించింది. కన్నడలో 'కిరాక్ పార్టీ' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా చేసే సమయంలోనే ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. మ్యాటర్ నిశ్చితార్థం వరకు వెళ్లింది. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో ఏం జరిగిందో కానీ... ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా... ఎవరి పనుల్లో వారు పడిపోయారు.

ఇప్పుడు తాజాగా 'కిరాక్ పార్టీ' సినిమాకు సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి రెడీ అయ్యాడు. వేరే హీరోయిన్ ను తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడు. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందనే భావనలో ఉన్నారట. ఈ విషయం రష్మికకు తెలియడంతో... రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. దీంతో, రష్మికతో కలిసి పని చేసేందుకు రక్షిత్ ను ఒప్పించే పనిలో నిర్మాతలు పడ్డారట. మరి... తన మాజీ లవర్ తో కలిసి నటించేందుకు రక్షిత్ ఒప్పుకుంటాడో? లేదో? వేచి చూడాలి.
Rashmika Mandanna
Ex Lover
Rakshit Shetty
Kannada Movie

More Telugu News