Atchannaidu: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్

  • వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు
  • జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
  • ఏ1 నిందితుడు రమేశ్ కుమార్ రాజమండ్రి సబ్‌ జైలుకు తరలింపు
ACB Court Remanded Atchannaidu for 2 weeks

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అచ్చెన్నాయుడిని శుక్రవారం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. మాజీ మంత్రితోపాటు ఈ కేసులో ఏ1 నిందితుడైన రమేశ్ కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వాదనల అనంతరం అచ్చెన్నాయుడు, రమేశ్ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు.

More Telugu News