Chandrababu: చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉన్నారు.. వారి మనోభావాలు  ఏంకావాలి?: అచ్చెన్న అరెస్ట్ పై చంద్రబాబు ఆవేదన

Chandrababu questions government over Atchannaidu arrest
  • బాత్రూంలోకి, బెడ్రూంలోకి కూడా వెళతారా? అంటూ ఆగ్రహం
  • అక్రమాలపై పోరాడిన ఫలితం ఇదేనన్న చంద్రబాబు
  • ఇందుకేనా ఒక్క చాన్స్ అడిగింది? అంటూ ఫైర్
అచ్చెన్నాయుడు అరెస్ట్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అక్రమ మైనింగ్, భూదందాలపై పోరాడినందువల్లే ఈ వేధింపులు అని ఆరోపించారు. ఆఖరికి బాత్రూంలోకి, బెడ్రూంలోకి కూడా వెళ్లి అచ్చెన్నను అరెస్ట్ చేశారని, ఆ సమయంలో వారి పిల్లలు కూడా అక్కడే ఉన్నారని, చదువుకున్న పిల్లలు వాళ్లు, వాళ్ల మనోభావాలు దెబ్బతినవా? అంటూ ప్రశ్నించారు.

ఈ అరాచకాలకు అంతే లేకుండా పోతోందని అన్నారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చెబుతున్నవి నవరత్నాలు కాదని, నవమోసాలు అని ఎద్దేవా చేశారు. ఇందుకేనా ఒక్క చాన్స్ అని అడిగింది? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu
Atchannaidu
Arrest
ACB
YSRCP
Andhra Pradesh

More Telugu News