Shakti Kapoor: నా కూతురు ప్రాణాలే ముఖ్యం.. షూటింగులకు పంపించను: శక్తికపూర్

I wont let my daughter Shraddha Kapoor to go to shootings now says Shakti Kapoor
  • షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
  • వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న బాలీవుడ్ షూటింగులు
  • ఇంకా దారుణమైన రోజులు ముందున్నాయన్న శక్తికపూర్
సినిమా, టీవీ షూటింగులకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, వచ్చే నెల నుంచి బాలీవుడ్ లో షూటింగుల సందడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగులు మొదలైనా.. తన కూతురు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఇప్పటికిప్పుడు షూటింగులకు పంపించనని చెప్పారు. వృత్తి చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ... ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యమని అన్నారు. తాను కూడా బయటకు వెళ్లనని చెప్పారు.

ఇప్పటి కంటే దారుణమైన రోజులు ముందున్నాయని తాను భావిస్తున్నానని శక్తికపూర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పిల్లలు బయటకు వెళ్లేందుకు తాను అంగీకరించనని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎవరైనా షూటింగులను ప్రారంభించినా... అంతా అస్తవ్యస్తంగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించడం కంటే వేచి ఉండటమే బెటర్ అని తాను తన సన్నిహితులకు చెపుతానని అన్నారు. బయట పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని... కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు.
Shakti Kapoor
Shraddha Kapoor
Bollywood
Shooting
Corona Virus

More Telugu News