Chandrababu: భార్యకు చెప్పి వస్తానన్నా గానీ ఏంటా తొందర?... ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తించారు?: చంద్రబాబు

  • అచ్చెన్న అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం
  • ఓ ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేదంటూ మండిపాటు
  • నేరస్తుడు సీఎం అయితే అధికారులు పావులవుతారని వ్యాఖ్య
Chandrababu fires on YSRCP government and CM Jagan

పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడ్ని వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపూరితంగా అరెస్ట్ చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశం ప్రదర్శించారు. ఓ ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం అంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగాలేదు, టాబ్లెట్లు తీసుకుని భార్యకు చెప్పివస్తానన్న వ్యక్తిని ఎందుకంత బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఐదు, పది నిమిషాల్లో ఏం జరిగిపోతుందని ప్రశ్నించారు.

"ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తించారు? నేను కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేశాను. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. ఓ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, అధికారులు అతని చేతిలో పావులుగా మారడం ఎంతో బాధాకరం" అంటూ వ్యాఖ్యానించారు.

35 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి పైకెదిగిన వ్యక్తిని, అతని కుటుంబాన్ని వేధిస్తున్నారని తెలిపారు. "ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానించారు. ఆంబోతు అని, బంట్రోతు అని అన్నారు. ఆకారం పెరగడం కాదు బుర్ర పెరగాలన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ మాటన్నారు. ఇన్ని చేసినా ప్రజల కోసం అచ్చెన్న అనునిత్యం పోరాడాడు. ఇసుక మాఫియా అంశంలో, మద్యం విషయంలో పోరాడుతున్నాడు" అంటూ అచ్చెన్నకు మద్దతు పలికారు.

More Telugu News