Aishvarya Rai: టిక్ టాక్ స్టార్ లో ఐశ్వర్య పోలికలు.. సినిమా ఆఫర్!

Aishvarya Rai look alike Amrutha gets movie offer
  • అమృతలో ఐశ్వర్య రాయ్ పోలికలు 
  • టిక్ టాక్ లో ఐశ్వర్య పాటలతో పాప్యులర్
  • 'పికాసో' మలయాళ సినిమాలో ఆఫర్
వెండితెర అందాలబొమ్మ ఐశ్వర్య రాయ్ కున్న క్రేజే వేరు. అందమంటే అలా ఉండాలంటూ ఆమెను ఉదాహరణగా కూడా చాలా మంది చెబుతుంటారు. అందుకే, ఆమెకు విరీతమైన ఫాలోయింగ్.. సినిమాలలో ఎంతో డిమాండ్. ఇక ఆమె పోలికలతో ఎవరైనా వున్నారంటే.. ఆ అమ్మాయిలకు కూడా ఇట్టే క్రేజ్ వచ్చేస్తుంది. పైపెచ్చు అభిమానులు కూడా ఏర్పడిపోతుంటారు. ఇప్పుడు అమృత విషయంలోనూ అదే జరుగుతోంది.

కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మలో ఐశ్వర్య పోలికలు బాగా కనిపిస్తాయి. అందుకే, ఆమె టిక్ టాక్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తే చాలు.. ఆ వెంటనే విపరీతమైన వ్యూస్ వస్తాయి. గతంలో ఐశ్వర్య నటించిన దక్షిణాది సినిమాలలోని పాటల్ని, సీన్స్ నీ అనుకరిస్తూ ఈ చిన్నది వీడియోలు తీసుకుని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఆ పోలికలే అమృతకు సినిమాలలో అవకాశం వచ్చేలా చేశాయి. 'పికాసో' పేరిట సునీల్ దర్శకత్వంలో రూపొందే మలయాళ చిత్రంలో అమృత హీరోయిన్ గా బుక్కయింది. మరి, ఐశ్వర్య పోలికలు ఈ చిన్నదానికి మరెన్ని ఆఫర్లు తెస్తాయో చూడాలి!    
Aishvarya Rai
Amrutha
TikTok
Picasso

More Telugu News