Mohan Babu: మా విద్యానికేతన్ కు 184వ ర్యాంకు వచ్చింది... చిన్న విషయమేం కాదు: మోహన్ బాబు

Mohan Babu responds on national level ranking for Sri Vidyaniketan college of Engineering
  • విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
  • జాతీయస్థాయిలో ర్యాంకు రావడం పట్ల మోహన్ బాబు హర్షం
  • తమ కాలేజీ సిబ్బందికి, విద్యార్థులకు అభినందనలు తెలిపిన నటుడు
కేంద్రం తాజాగా జాతీయ స్థాయిలో విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ ర్యాంకుల్లో తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీకి 184వ ర్యాంకు లభించింది.

దీనిపై శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత, ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజి కుటుంబానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 2020 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో తమ సంస్థ జాతీయస్థాయిలో 184వ ర్యాంకులో నిలిచిందని, ఇదేమీ చిన్న విషయం కాదని, అందరికీ జేజేలు అంటూ వ్యాఖ్యానించారు.
Mohan Babu
Sri Vidyaniketan Engineering College
Rank
NIRF-2020
HRD
Centre

More Telugu News