Kanna Lakshminarayana: అవినీతికి పాల్పడే రాజకీయనేతలపై చర్యలు తీసుకోవాల్సిందే: కన్నా లక్ష్మీనారాయణ

Kanna says do not spare anyone who indulged in corruption
  • అచ్చెన్నాయుడి అరెస్ట్ పై స్పందించిన కన్నా
  • అవినీతికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు
  • సీఎం జగన్ తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్
ఏపీలో అచ్చెన్నాయుడి అరెస్ట్ అంశం రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి నేతల భరతం పడతామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలని, ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైనా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kanna Lakshminarayana
Atchannaidu
ACB
Arrest
YSRCP
Jagan

More Telugu News