Andhra Pradesh: కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. ఫస్టియర్ కు మార్కులు, సెకండియర్ కు గ్రేడింగ్!

  • సాయంత్రం 4 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల
  • రెండు సంవత్సరాల ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి
  • ఫస్టియర్ కు సబ్జెక్టువారీగా మార్కుల విధానంతో ఫలితాల విడుదల
AP Intermediate results to be announce by 4 PM today

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను bie.ap.gov.in , results.bie.ap.gov.in సైట్లలో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ తో పాటు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి రిజల్ట్ ను చూసుకోవచ్చు.

గత కొన్నేళ్లుగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సారి ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో, సబ్జెక్టులవారీ మార్కుల విధానం ద్వారానే ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తోంది. అయితే సెకండియర్ విద్యార్థుల ఫలితాలను మాత్రం గ్రేడ్ పాయింట్లతో విడుదల చేయనున్నారు. గత ఏడాది ఫస్టియర్ ఫలితాలను గ్రేడింగ్ ద్వారా ఇవ్వడంతో.. సెకండియర్ విద్యార్థులకు ఈ ఏడాది కూడా గ్రేడింగ్ ద్వారానే ఫలితాలను ఇవ్వనున్నారు.

More Telugu News