Baba Ramdev: కరోనాకు ఈ ఆయుర్వేద మందు సమర్థవంతంగా పనిచేస్తోంది: బాబా రామ్ దేవ్ ప్రకటన

  • గిలోయ్, అశ్వగంధ కాంబినేష‌న్ తో చికిత్స 
  • 100 శాతం ప్రభావవంతంగా పని చేస్తోంది
  • వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్న రామ్ దేవ్
Baba Ramdev Claim tha Patanjali Invented Corona Medicine

కరోనా వైరస్ కు విరుగుడును కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు శ్రమిస్తున్న వేళ, ప‌తంజ‌లి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్ ‌దేవ్ సంచలన ప్రకటనను చేశారు. క‌రోనాను ఎదుర్కోగల ఔషధాన్ని సిద్ధం చేశామని ఆయన అన్నారు.

 ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖను రాశారు. గిలోయ్, అశ్వగంధ కాంబినేష‌న్ తో క‌రోనాకి చికిత్స చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ శరీరంలోకి వెళితే, మొత్తం కణజాల వ్యవస్థపై ప్రభావం చూపి, వాటిని నాశనం చేస్తున్నదని, అయితే తాము తయారు చేసిన మెడిసిన్, శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు.

అశ్వగంధ, గిలోయ్ తులశివతిలతో దీన్ని తయారు చేశామని, రోగులకు ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా ఇచ్చి పరీక్షలు చేశామని ఆయన అన్నారు. తాము ఇప్పటికే 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు నమోదు చేశామని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు.

కాగా, ఇప్పటికే ఢిల్లీ ఐఐటీ, జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ, కరోనాపై పోరులో సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చిన సంగతి తెలిసిందే. అశ్వగంధలో సహజసిద్ధంగానే విటానోన్ (డబ్ల్యూఐ-ఎన్) పెరుగుతుందని, ఇది కరోనా ప్రధాన ప్రొస్టేట్ పై ప్రభావం చూపిస్తోందని వెల్లడించింది.

ఇప్పటికే గిలోయి, అశ్వగంధలను ఎన్నో ఏళ్లుగా డెంగ్యూ, మధుమేహం తదితర రోగాలపై వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వీటిని అమృతాలని కూడా పిలుస్తారు. డెంగ్యూ వచ్చినప్పుడు వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఉష్ణోగ్రతను పెరగకుండా చూస్తాయని గతంలోనే తేలింది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి తనవంతు పాత్రను పోషిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

More Telugu News