Vijayasai Reddy: ఈ సమయంలో షష్టిపూర్తి సంబరాలేంటి బాబు గారూ... మీ బావమరిదికి మీరైనా చెప్పొచ్చు కదా!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy questions on Balakrishna birthday celebrations
  • నిన్న బాలయ్య పుట్టినరోజు వేడుకలు
  • కుటుంబ సమేతంగా హాజరైన చంద్రబాబు
  • ఈ పరిస్థితుల్లో ఇలాంటి సాహసం చేస్తారా? అంటూ విజయసాయి ట్వీట్
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో సహా పాల్గొన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

కరోనా వైరస్ కారణంగా దేశమంతా భౌతికదూరం పాటిస్తున్న వేళ బాలకృష్ణ షష్టిపూర్తి సంబరాలేంటి బాబు గారూ..? అంటూ ప్రశ్నించారు. "మీ బావమరిదికి మీరైనా చెప్పొచ్చు కదా. మెంటల్ సర్టిఫికెట్ ఉంది కదా అని కరోనా సమయంలో కూడా వేడుకలు జరుపుకునే సాహసం చేస్తారా ఎవరైనా?" అంటూ నిలదీశారు. హిందూపురం ప్రజలను గాలికి వదిలేశారంటూ విమర్శించారు.
Vijayasai Reddy
Balakrishna
Chandrababu
Birthday
Celebrations
Lockdown
Corona Virus

More Telugu News