Lashkar e Taiba: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

  • జమ్ముకశ్మీర్ లష్కరేతాయిగాకు ఎదురుదెబ్బ
  • ముగ్గురు ఉగ్రవాలను అదుపులోకి తీసుకున్న బలగాలు
  • మరిన్న అరెస్టులు జరగనున్నాయని చెప్పిన ఎస్పీ
3 LeT terrorists arrsted and seized 100 cr worth heroin

జమ్ముకశ్మీర్ లో పాక్ ప్రేరేపిత లష్కరేతాయిబా ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాలు ఈరోజు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశాయి. వీరంతా పాకిస్థాన్ లోని హ్యాండ్లర్స్ తో టచ్ లో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 100 కోట్ల విలువైన 21 కేజీల హెరాయిన్, రూ. 1.34 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా హంద్వారా ఎస్పీ సందీప్ చక్రవర్తి మాట్లాడుతూ, ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించామని చెప్పారు. వీరిలో ఇఫ్తికార్ ఇంద్రాబీ అనే వ్యక్తి డ్రగ్ స్మగ్లర్ అని... ఇప్పటికే ఇతనిపై పలు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని తెలిపారు. రెండో వ్యక్తి అతని అల్లుడు మోమిన్ పీర్, మూడో వ్యక్తి ఇక్బాల్ ఉల్ ఇస్లామ్ అని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు జరగబోతున్నాయని తెలిపారు. ఉగ్రవాదుకు నిధులను సమకూర్చేందుకు వీరు ముగ్గురూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు.

More Telugu News