Pinarayi Vijayan: రెండో వివాహం చేసుకోనున్న కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె

Kerala CM Pinarayi Vijayan daughter to marry DYFI National president
  • డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిని పెళ్లాడనున్న విజయన్ కుమార్తె వీణ
  • బెంగళూరులో ఐటీ కంపెనీని నిర్వహిస్తున్న వీణ
  • ఈ నెల 15న కొద్ది మంది సమక్షంలో వివాహ వేడుక
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆమెకు ఇప్పటికే పెళ్లయి ఒక సంతానం ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల భర్తతో వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది. బెంగళూరులో వీణ సొంత సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు.

రియాజ్ అనే వ్యక్తిని వీణ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన రియాజ్... 2009 పార్లమెంటు ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రియాజ్ కు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఆయనకు కూడా తొలి భార్య వల్ల ఇద్దరు పిల్లలు జన్మించారు. తొలి భార్యతో ఈయన వైవాహిక జీవితం కూడా ముగిసింది.

జూన్ 15వ తేదీన వీణ, రియాజ్ ల వివాహం జరగనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువుల మధ్య పెళ్లి జరగబోతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి పీఎం అబ్దుల్ ఖాదర్ కుమారుడు రియాజ్. 2017లో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు.
Pinarayi Vijayan
Daughter
Marriage

More Telugu News