Sensex: యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో భారీగా నష్టపోయిన మార్కెట్లు

  • యూస్ ఎకానమీ 6.5 శాతం తగ్గుతుందని ప్రకటన
  • 708 శాతం పతనమైన సెన్సెక్స్
  • 214 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex ends 708 points lower

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఏడాది అమెరికా ఎకానమీ 6.5 శాతం కుంగిపోతుందని, నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరుకుంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 708 పాయింట్లు పతనమై 33,538కి పడిపోయింది. నిఫ్టీ 214 పాయింట్లు కోల్పోయి 9,902కి దిగజారింది.

నిఫ్టీలో ఈ నాటి ట్రేడింగ్ లో 1016 షేర్లు అడ్వాన్స్ కాగా, 1497 షేర్లు పతనమయ్యాయి. 146 షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభాలను ఆర్జించగా... భారతి ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్ టైన్ మెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News