Jagan: కేంద్ర మంత్రి జయశంకర్ కు జగన్ లేఖ

CM Jagan writes letter to External Minister Jayashankar
  • విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను వెనక్కి రప్పించండి
  • విమానాల సంఖ్యను పెంచండి
  • అక్కడి నుంచే వచ్చే చార్టెడ్ ఫ్లైట్స్ కు అనుమతి ఇవ్వండి
భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను క్షేమంగా వెనక్కి రప్పించాలని లేఖలో కోరారు. ఎక్కువ విమానాలను నడిపి రాష్ట్రానికి తీసుకురావాలని విన్నవించారు. ప్రవాసాంధ్రులను రప్పించేందుకు విమానాల సంఖ్యను పెంచాలని కోరారు.

కిర్గిజ్ స్థాన్, కతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లోని తెలుగు సంఘాలు... ఏపీలోకి చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని కోరుతున్నాయని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వందే భారత్ విమానాలు కానీ, చార్టెడ్ ఫ్లైట్స్ కానీ ఎన్ని వచ్చినా ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీకి వందే భారత్ విమానాల సంఖ్యను పెంచడమే కాకుండా, అక్కడి ప్రవాసాంధ్రులు ఏపీకి వచ్చేందుకు వీలుగా చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు.
Jagan
YSRCP
Jayashankar
External Minister
Letter

More Telugu News