Revanth Reddy: మీ ప్రాబ్లం నాకు తెలుసు గానీ... నా డ్యూటీ నేను చేయాలి కదా!: పోలీసులతో రేవంత్ రెడ్డి

  • రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట పోలీసులు
  • తాను బయటికి వెళ్లాలన్న రేవంత్
  • అడ్డుకున్న పోలీసులు
Revanth Reddy talks peacefully with police

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ తన నివాసం నుంచి వెలుపలికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ప్రెస్ మీట్ కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. అయితే పోలీసులు అందుకు అనుమతించకపోవడంతో, గాంధీ ఆసుపత్రి వద్ద డాక్టర్ల ధర్నా జరుగుతోందని, కనీసం అక్కడికి వెళ్లి డాక్టర్లను పలకరించి వస్తానని అన్నారు. పోలీసులు అందుకు కూడా ఒప్పుకోకపోవడంతో, ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించారని, ప్రజా సమస్యలపై తాను ఇక్కడే ఉండి ఎలా స్పందించగలనంటూ రేవంత్ బదులిచ్చారు.  

'మా ప్రాబ్లం మీకు తెలుసు కదా సార్?' అంటూ పోలీసు అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, 'మీ ప్రాబ్లం నాకు తెలుసు గానీ, నీ డ్యూటీ నువ్వు చేసినట్టే నా డ్యూటీ నేను చేయాలి కదా?' అంటూ రేవంత్ రెడ్డి సామరస్య పూర్వకంగా చెప్పారు. 'కొట్లాడితేనేమో కొట్లాడిన్రంటరు... కొట్లాడితే గానీ మీరు పోనివ్వరు... ఏం చెయ్యాలె!' అంటూ రేవంత్ నవ్వుతూనే తన వైఖరి వినిపించారు.

"నేను బయటికి వెళితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంటుంది... ప్రెస్ మీట్ కు వెళ్లాలి, అక్కడ్నించి గాంధీ ఆసుపత్రికి వెళ్లాలి.  అట్నుంచెటైనా వెళతాను, లేకపోతే ఇట్నుంచి అటైనా వెళతాను... కావాలంటే మీ వాహనంలోనే వస్తాను. మీ పై అధికారికి ఫోన్ చేసి అడగండి" అంటూ రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.


More Telugu News